TRINETHRAM NEWS

ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

*ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

*వైద్యులు విధి నిర్వహణ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి

*రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రామగుండం, జనవరి -18 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం జనరల్ ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ
శ్రీ హర్ష రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామగుండం వైద్య కళాశాల పరిధిలోని ఆసుపత్రిలో రోగులతో ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించే తీరు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ఆసుపత్రిలోని లేబర్ రూమ్, ఎం.ఐ.సి.యూ, నూతనంగా నిర్మించిన బ్లాక్ లోనే మెడికల్ వార్డు, ఐసియూ లను కలెక్టర్ పరిశీలించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరింత మెరుగ్గా పారిశుధ్యం పనులు జరగాల్సిన అవసరం ఉందని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఆసుపత్రిలో వైద్యులు విధినిర్వహణ సమయంలో అందుబాటులో ఉండాలని, ఔట్ పేషెంట్ వచ్చే సమయంలో డాక్టర్ లు అందుబాటులో ఉండాలని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన ప్రజలకు శస్త్ర చికిత్సలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం ఆసుపత్రి సమీపంలో గల నర్సింగ్ కళాశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు జరుగుతున్న తరగతుల వివరాలను ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఎమ్.ఓ. డాక్టర్ రాజు, డా .రేణుకా ,డా. అశోక్ , నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసూన, వైస్ ప్రిన్సిపాల్ సుశీల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App