TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించండి
క్రేస్తవులపై దాడులు ఆపండి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు

క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది క్రైస్తవ సంఘాల బోధకుల వెల్లడి…

కాకినాడ మార్చి 28 : క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు, ఏఐటియుసి ఏఐఎస్ఎఫ్, ఏపీ మహిళా సమైక్య
ప్రజా సంఘాలు, ఆధ్వర్యంలో ఎస్ అచ్యుత పురం, అంబేద్కర్ జంక్షన్ గాంధీనగర్ జెఎన్టియు మూడు ప్రాంతాల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానకి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై గత మూడు రోజులగా ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయని పాస్టర్ కుటుంబీకులకు కు అనేక అనుమానాలు ఈ మృతిపై ఉన్నాయని ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందించి హైకోర్టు సిట్టింగ్ న్యాయ విచారణ జరిపించాలని మధు కోరారు లేనిపక్షంలో దీనిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాంతియుతంగా ర్యాలీలు చేస్తామని ఆయన కోరారు

క్రైస్తవ బోధకులు పాస్టర్ కె డి వి ప్రసాద్ , ప్రేమ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం శాంతి సమాజాన్ని కోరుకుంటుందని అలాంటి క్రైస్తవ బోధకుడు మృతిపై అనుమానాలు రావడం దురదృష్టకరమన్నారు క్రైస్తవులపై దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు .మనిషిని ప్రేమించడం మానవత్వం గల వ్యక్తి ఇలాంటివి ప్రవీణ్ చూసే నేర్చుకోవాలని ఆయన కోరారు

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ వందన సమర్పణ చేస్తూ యూట్యూబ్ ఫేస్బుక్లో ప్రవీణ్ పగడాల బోధనలు వింటుంటే సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఆయన పరితపించిన వ్యక్తి అని ప్రసాద్ అన్నారు ఇలాంటి మానవతవాది మృతి చెందడం దురదృష్టకరమని ఈ మృతిపై ప్రభుత్వం వెంటనే పోస్ట్మార్టం రిపోర్ట్ ను బయటపెట్టి న్యాయ విచారణ జరిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి సహకరించిన క్రైస్తవ పెద్దలకు దళిత సంఘాలు ప్రజా సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు యువతి యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ మహిళా సమైక్య కాకినాడ జిల్లా కన్వీనర్
ఏ భవాని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు టి ప్రేమ్ కుమార్ ఎస్సీ ఎస్టీ చైర్మన్ కొల్లాబత్తుల అప్పారావు చర్చి పెద్దలు బచ్చల చంద్ర శేఖర్ శ్రీను, ప్రేమకుమార్, టి రాజు చిన్ని తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Candlelight peace rally in