TRINETHRAM NEWS

ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు

Trinethram News : అమరావతి

ఏపీలో కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ. 100 కోట్ల పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. సెటాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్కు నెలకు రూ.59 చొప్పున ఇకపై వసూలు చేయబోమన్నారు. ఫైబర్ నెట్ ప్లాన్లను సవరించి తక్కువ ధరకు సేవలు అందించేలా చర్యలు చేపడతామన్నారు. అటు తిరుమల కొండపై అన్ని ఆఫీసులు, షాపులు, ఇళ్లకు ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇస్తామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App