
చెరువు గ్రామంలో ఘన స్వాగతం.. పసుపుమయమైన రహదారులు
Campaigning Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల మండలం చెరువు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసి కూటమి అభ్యర్థి చుక్క నర్మద, ఎంపిటీసి ,ఎంపిపి అభ్యర్థి మున్నం ఏడుకొండలు రెడ్డి, చెరువు ఎంపీటీసీ సెగ్మెంట్ కూటమి అభ్యర్థి మోచర్ల రాజమ్మ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా చెరువు గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కి అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని రోడ్లన్నీ పసుపుమయంగా మారిపోయి, పండుగ వాతావరణాన్ని తలపించాయి. ప్రజల నుంచి వస్తున్న ఈ అఖండ స్పందన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలా మారుతుందని స్పష్టం చేస్తోంది.
గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తమ నాయకుడిని చూసేందుకు, ఆయనతో మమేకం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe