విజయవాడ : రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా అందులో భాగమే..
ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. అయితే వైపీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) వైసీపీకి దూరంగా ఉండడంపై టీడీపీ నేత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని అన్నారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారన్నారు. మూటలు ఇచ్చాక సీట్లల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే.. అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు..
విజయవాడ ఎంపీ కేశినేని నాని (Vijayawada MP Kesineni Nani) దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదని.. అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు..