TRINETHRAM NEWS

బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

Trinethram News : Telangana : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొంది

బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారు ?

జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు

కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు

ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి

రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం

మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తాం

42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలి

అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు

సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తాం

జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

ఏటా రూ. 20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App