
అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అరకువేలీ ఏప్రిల్ 8: ఆదివాసీల సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పాజోర్(ఇటుకల పండగ)ని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్నుదొర పేర్కొన్నారు. ప్రస్తుతం ఆదివాసి ప్రాంతాలు అంతటా కూడా ఇటుకుల పండగ సందడి నెలకొంది. ఆదివాసి మహిళలంతా పాజోర్ పట్టి వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు పరిశీలించేందుకు సియ్యారి దొన్నుదొర పర్యటిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ గిరిజన మహిళలు పాజోర్ పట్టి ఆయనకు తిలకం దిద్ది స్వాగతం చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆదివాసీల సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎక్కడ పాజోర్ పడితే అక్కడ గిరిజన మహిళల వద్ద నుంచి బొట్టు తిలకం దిద్దుకొని పాజోర్ చెల్లిస్తున్నారు. ఈ సందర్భంగా సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విభిన్న సంస్కృతి- సంప్రదాయాలు, సనాతన కట్టుబాట్లు ఆదివాసీలకు మాత్రమే సొంతమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ నేపథ్యంలో సనాతన సాంప్రదాయాలు దూరమై విదేశీ సంస్కృతులు అలవడుతున్న సరే గిరిజన ప్రాంతంలో మాత్రం ఆదివాసీల కట్టుబాట్లు సాంప్రదాయాలకు ఎప్పుడూ గౌరవం తగ్గలేదన్నారు. వాటి ఆదరణ ఎప్పటికీ కూడా పెరుగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అద్భుత నాగరిక సమాజంలో తాము కూడా జీవిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
