
Trinethram News : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్స వాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.
మొదటి రోజు ఆదివారం ఉగాది సందర్భంగా ఉదయం మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేదమంత్రాల నడుమ గౌతమి నది నుండి తీర్థ జలం తీసుకుని వచ్చి శ్రీస్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహిం చారు.
శ్రీరామచంద్రస్వామి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవ్వాలా నవాహింక మహోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ నిర్వహించారు.
స్వామివార్లకు పంచా మృతాలతో అభిషేకం విశేష మృత్యుం గ్రహణం వాస్తు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి వారి ని రాజ వీధిలో కల్పవృక్ష వాహనం పై తిరువీధి సేవ నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
