Brahmin Kunta Cheruvu Sikham should protect the land
రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు అవినీతికి పరాకాష్టబె వారిచ్చిన రిపోర్ట్
కబ్జాదారులకు అండగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చొప్పదండి ప్రజలు అనుకుంటే చెరువు శిఖం భూమిని కాపాడుకోవచ్చు.
AIFB ప్రజలకు పిలుపు
చొప్పదండి త్రినేత్రం న్యూస్
ఈ రోజు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుంట చెరువు శిఖం చెరువు హద్ధులు నిర్ణయించాలని ఆ తర్వాతనే మున్సిపల్ నుండి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ మరియు మున్సిపల్ కమీషనర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఐ.ఎఫ్.బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ బ్రాహ్మణ కుంట చెరువు శిఖం భూమిని కాపాడాలని గతంలోనే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన మున్సిపల్, రెవిన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బ్రాహ్మణ కుంట చెరువు శిఖం భూమి పక్కనే పట్టా భూమి సర్వే నెంబర్:301 ని చూపిస్తూ చెరువు శిఖం భూమి సర్వే నెంబర్ :300 లలో ప్లాట్స్ చేసి విక్రాయిస్తున్నారని ఆరోపించారు. అప్పటి తహసీల్దార్, ఆర్ ఐ కబ్జాదారులతో కుమ్మకు అయి తప్పుడు నివేదికలు ఇచ్చారాని ఆరోపించారు. చెరువు శిఖం భూమి సర్వే నెంబర్ 300 లో పూర్తి విస్తీర్ణం తీసి హద్ధులు నిర్ణయించాలని, శిఖం భూమి పక్కనే ఉన్న పట్టభూమి సర్వే నెంబర్ :301 లో పూర్తి విస్తీర్ణం తీయాలని వారు అమ్ముకోగా ఎంత భూమి మిగిలి ఉన్నదో బయట పెట్టాలని డిమాండ్ చేసారు. ప్రస్తుత స్థానికి తహసీల్దార్ రీసర్వే నిర్వహించి చెరువు శిఖం భూమిని కబ్జాదరులా నుండి కష్పడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు.
భూముల ధరలు పెరగడంతో భూమాపియా కబ్జాదారులు చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. కబ్జాదారుల వెనుక ప్రజాప్రతినిధులు ఉండవచ్చు అని ఆరోపించారు. మా ఏఐఎఫ్ బి పార్టిగా రెండు సార్లు ఫిర్యాదులు ఇచ్చిన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాజి పడకుండా కూల్చివేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కుంట కుంట శిఖం చెరువుకు హద్దులు నిర్ణయించినాకే మున్సిపాలిటీ నుండి నిర్మాణం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెరువులు కబ్జాదారులకు కాపలాదారులుగా రెవిన్యూ, ఇగిగేషన్ , మున్సిపాలిటీ అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ పూర్తి విస్తీర్ణం తీసి హద్ధులు నిర్ణయంచండి అని చెప్పిన ఎందుకు పెడచేవినా పెడుతున్నారని విమర్శించారు. బ్రాహ్మణ కుంట చెరువు కబ్జా గురవుతుందనిఅనేక మందికి తెలిసిన మౌనంగా ఉన్నారని అన్నారు. మా పార్టిగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, సామజిక సంఘాలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందిస్తామని తెలిపారు. బ్రాహ్మణ కుంట చెరువుకు హద్దులు నిర్ణయించకుండా మున్సిపల్ కమిషనర్ నిర్మాణ అనుమతులు ఇస్తే కమిషనర్ పై ఆందోళన పోరాటలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రశాంత్ కుమార్, కె. బద్రినేత పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App