Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 30
మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.
అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్ సింగ్ పోటీప డనున్నారు.
మధుర లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే.. ఏప్రిల్ 26వ తేదీన ఓటింగ్ జరగ నుంది.జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
బీజేపీ అభ్యర్థి హేమమాలి ని గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అంటే 2014- 2019లో మధుర లోక్‌సభ నుంచి గెలుపొందారు.
ఈ క్రమంలో మధుర లోక్‌సభ స్థానానికి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలినిని పోటీకి దింపింది..