
Bonus Distribution : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. అక్టోబర్ 6.(త్రినేత్రం న్యూస్ ). పెనుమూరు.:శ్రీజ డెయిరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు బోనస్ పంపిణీ కార్యక్రమం పెనుమురు లో నిర్వహించారు. పెనుమురు పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో శ్రీజా డెయిరీకి నిరంతరాయంగా పాలు సరఫరా చేస్తున్న రైతులకు మొత్తం రూ.11 లక్షల బోనస్ అందజేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతులకు ప్రతి లీటరు పాలకు 0.55 పైసల చొప్పున ప్రోత్సాహక బోనస్ అందించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా ఖనిజ మిశ్రమం, పశువుల సంరక్షణ సంచులను పంపిణీ చేశారు. పాడి రైతులను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు శ్రీజా డెయిరీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని మేనేజర్ మునికృష్ణ తెలిపారు.
శ్రీజా డెయిరీ మహిళల అభివృద్ధి, ఆర్థిక సాధికారతకు శ్రీజా డెయిరీ ఎల్లప్పుడూ ముందుంటుందని పి ఐ బి మురళి తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు డెయిరీ తరఫున ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అత్యధికంగా పాలు సరఫరా చేసిన ఐదుగురు మహిళా రైతులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో ప్రాంతీయ ఎ సి ఓ మునికృష్ణ , పీఐబీ అధికారి ఎన్. మురళి, పర్యవేక్షకుడు మగేష్, మునీంద్ర బాబు, పాలమిత్రాలు మరియు మహిళ రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe