TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ

తామేదో డబ్బుకి అమ్మడు పోయినట్లు, బెదిరించి బిజెపిలో చేర్చుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తామే ఇష్టపూర్వకంగా బిజెపిలో చేరినట్లు తెలిపారు.

ఎంపీటీసీ చిన్నం వీరరాఘవరెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీగా ఎన్నికై మూడున్నర సంవత్సరాలు అయిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎంపీటీసీగా తనకు ఓ గుర్తింపు లభించిందన్నారు.వైసిపి పాలనలో తనకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో కనీసం ఎమ్మెల్యే ని కలిసేందుకు కూడా వీలు అయ్యేది కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ఎంపీటీసీగా ఎన్నికైతే తమ సమస్యలను కూడా పరిష్కరించలేక పోయే వాళ్ళమని వాపోయారు. తామె ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదని ఇష్టపూర్వకంగానే బిజెపిలో చేరామని తెలిపారు.

ఎంపీటీసీ తొండపు శాంతి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. తమనెవరు ఇబ్బంది పెట్టడం కానీ డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం కానీ చేయలేదని తమ ఇష్టపూర్వకంగానే బిజెపిలో చేరినట్లు చెప్పారు. ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు తమ పదవికి న్యాయం చేయలేదని, పార్టీ మారితే తమకు తగిన గుర్తింపు వస్తుందని, ప్రజా సమస్యలను పరిష్కరించవచ్చు అనే ఆలోచనతోనే పార్టీ మారినట్లు ఆమె చెప్పారు.

ఎంపీటీసీ గొర్రెల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తను ఇష్ట ప్రకారమే బిజెపిలో చేరానన్నారు.

మరో ఎంపీటీసీ జంపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. వైసిపి నుంచి బిజెపిలోకి ఇష్టపరకారం వచ్చామన్నారు. గతంలో ఎంపీటీసీ లందరూ పూర్వపు ఎంపీపీ జ్యోతిర్మయి శేషు కుమార్ కి మద్దతుగా నిల్చమని అయితే ఆమె మధ్యలోనే విడిచి పెట్టేసారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయి ఎంపిటిసి లందరూ ఏమయ్యారని ఆలోచన కూడా చేయలేదని దీంతోనే తాను పార్టీ మారినట్లు తెలిపారు. తను పార్టీ ఎవరు ప్రలోభ పెట్టలేదని ఆమె చెప్పారు.

ఎంపీటీసీ కొర్ల చక్ర రావు మాట్లాడుతూ.. తనని ఎవరూ భయపెట్టలేదని ఎవరు డబ్బు ఇవ్వలేదని తాను బిజెపిలో చేరాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్లు చెప్పారు. గత ఎంపీపీ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లిపోవడంతో తాము బిజెపిలోకి వచ్చినట్లు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాడిని అనంతరం వైసీపీలో చేరి ఎంపీటీసీగా గెలుపొందనన్నారు. అయితే తనకు ఎంపీటీసీగా వైసీపీలో విలువ లేకపోవడంతోనే పార్టీ మారినట్లు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bikkavolu MPP Tethali Suma