Bike rally on loan waiver in Peddapalli
అన్నదాత సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
రైతులకు అండగా కాంగ్రెస్ సర్కార్..
అన్నదాత సంక్షేమం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని, ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్రంలోని 11.50 లక్షలకు మంది రైతులకు రూ. 6098 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ సర్కార్ దేనని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శుభపరిణామమని కొనియాడారు. దేశానికి అన్నం పెట్టే రైతున్న అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకం అని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 17 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మరో 2 వేల మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో పొందిన రుణాలకు రుణమాఫీ వర్తించేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వెన్నంటి ఉంటుందని అభయమిచ్చారు. రానున్న పంటకాలానికి సన్న వడ్లను క్వింటాల్ కు రూ. 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు.
రైతు బీమా, పంటల బీమా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీతో పెద్ద ఎత్తున రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ దశాబ్ధపు అతి పెద్ద వేడుక, రైతన్నలకు రుణమాఫీ పండుగ అని ఎమ్మెల్యే కొనియాడారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి జెండా చౌరస్తా వద్ద బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App