TRINETHRAM NEWS

Trinethram News : నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు.

నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బీఆర్ఎస్ సభ జరుగుతుంది. ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. చుట్టుపక్కల గ్రామాలనుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా భారీయెత్తున జనసమీకరణ చేస్తున్నారు.

సభా వేదికపై 200 మంది కూర్చునేలా విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు కాస్త దూరంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. వేదికకు సమీపంలోనే హెలీపాడ్ ను కూడా సిద్ధం చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.