TRINETHRAM NEWS

ఆధునికత పేరుతో అసలు బాపట్లను మర్చిపోతున్నారు. అసలు మా ఊరు ఎంత బాగుంటుంది. కళ్లు జిగెల్ మనిపించే ఇంత వెడల్పునుండే పెరుగుదోట కూర,

గోంగూర కట్టలు.. వంగనారు టమెటా నారు పొగనారు సరివి యూకలిప్టస్ నారు కట్టలేసుకుని సర్రున దూసుకుపోయే చక్కరిక్షాలు.. పుల్లల కావిడిలు.

చిలకడదుంపల బళ్లు.. ఇనుము రాగి ఇత్తడి జర్మన్ సిల్వర్ వస్తువులకు జీడీలు.పప్పుచెక్క పెట్టే పెద్దాయన, అయిసా.. చల్లని అయిసా..పాలైసా.అంటూ అమ్మిన

తాతకు అన్నం పెట్టిన అరుగులు మర్చిపోతున్నారు. ఇంకా షేపు మారిపోయిన షరాబు బజారు. అక్కడికక్కడే కొలతలు తీసి రవికలు కుట్టిచ్చిన చైనా బజారు.. ఠీవిగా

నిలబడి ఎవడ్రా?అది అనిపించే గడియారస్థంభం. దానిపక్కన గ్రామ చావిట్టో కూర్చుని సంతకాలు చేసిన లావుపాటి వీరాస్వామి… శ్రీ సీతారామాంజనేయ బార్

అండ్ రెస్టారెంట్ .. దానికెదురుగా తూనుగుంట షాపు మందు పైజామా లాల్చి తో ప్లెయిన్ సిగరెట్ తాగి తరువాత హడావుడి గుడ్డి వెలుతురులో అమ్మే గరగరం..

ఇంకొంచెం ముందుకొస్తే మహలక్ష్మమ్మ చెట్టుకింద కొత్త మాసు లక్ష్మయ్య కిరాణాషాపు.. పరిచయం ఉన్న ఆడవాళ్లను పిలిచి ఆకులో చుట్టి తీసుకెళ్లమ్మా … మా

అబ్బాయి బాగున్నాడా? అంటూ పూలు పంచే పూల నాగేశ్వరరావు,దాని పక్కనే కరిపాకు చల్లి గంపలో పెట్టిన బూందీ అమ్మిన శివా స్వీట్స్ కార్నర్.. మెట్లెక్కగానే

రామ్మా.. ఏంటి? అనడిగి కౌంటర్ మీదే మందులిచ్చే థనలక్ష్మి మెడికల్స్, బజ్జీల బావయ్య బజ్జీలు .మెత్తని పకోడీ, పప్పు కొట్లొ ఉప్పు శెనగలు, టెంకాయలు అగరబత్త

అమ్మే జగన్నాధం కొబ్బరి కాయలషాపు. దాని పక్కనే కేశవ కూల్ డ్రింక్స్ లెమన్ వాటర్ ,ద్రాచ్చ,. బాదం పాలు, నోట్టో వేసుకోగానే కరిగిపోయే తీపి కిళ్ళి కట్టే క్రిష్ణ

మూర్తి బాలాజీ పాన్ షాపు. మున్సిపల్ య హై స్కూల్ లో పంచపాండవుల చెట్లు,దాని నీడలో పెంకుటింట్లో నేత క్లాసులు. పాత వాసన కొట్టే లైబ్రరీ, పెద్ద నేత

మాస్టారు చిన్న నేత మాస్టారు. ఎన్ ఎస్ ఎస్ టీచర్ పద్మావతి గారు,నాగలక్ష్మి టీచర్, హిందీ టీచర్ లక్ష్మి నరసమ్మ, సింగు మాస్టారి మైకు రూము, రఫూఫ్ మాస్టారి

చెరగని క్రాఫూ, అప్పుడప్పుడు మేడ మీద నుంచి రక్తపు వాంతులు చేసుకున్న కేజీకే మాస్టారు. బొండు మల్లెలా కనిపించే హెడ్మాస్టర్ పరశురాం

మాస్టారు.నాలుగున్నర కల్లా వాలిబాల్ ఆట ఇరగదీసే మా కొండాకిస్టయ్య,టివినర్సింహారావు మాస్టారు. తెలుగు పాటాలు చెప్పిన పిపియస్, కేటీయార్.లంకా

వెంకటరామయ్య మాస్టార్లు.. సర్టిఫికెట్లు ఇవ్వడానికి సరదాగా సతాయించిన క్లర్క్ కొండయ్య.. విజిలేస్తే ఆంధ్రాసోడా బుడ్డి అనిపించే యన్డియస్ మాస్టారు. అదే

చివర మెలితిరిగిన మీసాలతో భీష్ముడి మాదిరి కనిపిస్తూ అందరికీ ఆటవస్తువులు ఇచ్చిన కిష్టమ్మ.,నందిరాజు తోట నుంచి వచ్చి న ఎన్సిసీ చెలమయ్య మాస్టారు.. మా

మున్సిపల్ హై స్కూల్ హీరోలను మర్చిపోతున్నాం.స్కూలు ముందు చెట్ల నీడలో ఉన్న కమ్మరి కొలిమిలో ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్ ను ఒడుపుగా తిప్పే మేస్త్రీ దానిని

సుత్తితో బాదే కండలు తిరిగిన కార్మికులు, ఏబియం స్కూలు పక్కన వెల్డింగ్ లైటింగ్ అన్ని ఆశ్చర్యాలే.. తీగ మీద నడిచిన అమ్మాయి. రింగులో నుంచి దూరిన

అబ్బాయి గారడీ మర్చిపోయాం.. సైకిలెక్కి కొత్త బస్టాండ్ దాటి ఉపిరి కాయల నారాయణ ఇల్లు దాటితే వచ్చే ఆర్ట్స్ కాలేజీ.. సైకిల్ స్టాండ్ పక్కనే కమ్మటి వాసన

గుబాళించిన రాజు బాబాయి క్యాంటిన్ పూరీ.. సిగరెట్లు తాగే రౌడీ విద్యాు్ర్ధుల నారాయణ టీ స్టాల్,. నోట్లో కిళ్లి తో సరదాగా కనిపించే వివియస్సార్. బివసంతరావు

మాస్టార్లు, వాకింగ్ లోనే కాలేజీకి వచ్చే రాజేశ్వర్రావు గారు. య కుర్రాళ్లకు అసూయ పుట్టించే డ్రస్సులేసిన శాంతారాం,పిడియస్ మాస్టార్లు, కత్తిలా పాఠాలు చెప్నిన కత్తి

భాస్క్ రరావు మాస్టారు.. య చరిత్రను కళ్లకు కట్టినట్టు బోధించిన యంఆర్ఆర్, యం ఎస్ ఎన్ మాస్టార్లు… ఫిజిక్స్ .బాటనీ.జూవాలజీలు భోధించిన

కొండలరావు,శర్మ,బాలకోటేశ్వర్రావు. బిఆర్ . డబ్లూ్జికే మాస్టార్లు.. అప్పుడప్పడు కోటు వేసుకుని గ్రౌండ్ లో కనిపించిన పొడుగు పీడీ గోవిందరావు గారు..తెలుగు

సాంబశివరావు ఇంగ్లీష్ వివియన్ గారు బాటనీ కెయస్టీ శాయి, అకౌంట్స్ టిడియార్ గారు.పది కొట్టగానే పిట్టకూడా కనిపించకుండా కంట్రోల్ చేసిన మా ప్రిన్సిపాల్ కేఆర్ కే గారిని.. మర్చి పోతున్నాం.తెల్లవారి. అయిదు కొట్టగానే గుడి మైకులో

నుంచి వినిపించే ఘంటసాల భగవద్గీత. డిశెంబర్ నెలలో వినిపించే తిరుప్పావై. ఏబియం చర్చ్ గంట.క్రీస్తు గీతాలు, ఇరవై నాలుగు గంటలు తక్కువ ధరలో టిఫిన్లు

,టీ లు అమ్మిన కుమార్ కాంటీన్, వేల బుట్టలకొద్ది చేపలను రైళ్లలో నింపిన బాపట్ల రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ ఫాం.. రిక్షా కార్మికుడి నుంచి రిచ్ మాన్ తో సహా కడుపారా

తిన్న ఉడిపి హోటల్ సాంబార్ ఇడ్లీ,, మాంచి చపాతీ కుర్మా, కాఫీ ఇచ్చే పియల్ నారాయణ,బాబుల రామక్రిష్ణ లంచ్ హోం.. నాటకాలు రీడింగ్ రూం టెబుల్ టెన్నిస్

లు ఆడుకున్న టౌన్ హాల్.. దాని ముందు ప్రకాష్, తిమోతీ వాళ్ల టీ స్టాళ్లు. శంకరం హోటల్.. ఇవ్వన్నీ మర్చిపోయాం..అవును. మర్చిపోయాం..అల్లరి నేర్పిన లిబర్టి అరుగులు,పేదలకు నాలుగు ముద్దలు డబ్బు లేకపోయినా పెట్టిన పెద్దమనసు సుబ్బమ్మ హోటల్, అర్ధరూపాయికే గంట సైకిల్ అద్దెకిచ్చిన భాషా సైకిల్ షాపు ను మర్చిపోతున్నాం.. కళ్ల

ముందు గడియార స్థంభం కూల్చేస్తుంటే అడ్డుకోలేక పోయాం..మూర తవ్వితే నీళ్ళు పడే బాపట్ల లో మంచినీళ్లు కొనుక్కుంటున్నందుకు బాధ పడుతూ ఆ

భావన్నారాయణ స్వామి గోపురమే నిట్టనిలువునా కూలిపోయింది.. కొండపాటూరు నుంచి సారె తెచ్చి . రథం ముందు అన్నం రాశిపోసి కర్రసాము. కోలాటాలతో

గోవిందా అంటూ రథాన్ని లాగిన సందర్భం ఇక చూడలేననుకుని స్వామి కూడా దిగిపోతున్నట్టున్నాడు. తలో చెయ్యవేసి భావన్నారాయణ సామికో గాలిగోపురం

కడదామురా బాబులూ.. మన ఊరు మంచిదిరా బాబూ..మన సముద్రం కూడా మంచిదే.. మన దేవుళ్లు మంచోళ్లు. లేక పోతే 1977లో ఉప్పెనగా మారిన తుపాను

బాపట్ల చెలియలి కట్ట దాటించ లేదు మన ఆంజనేయ స్వామి.