TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ,మార్చి,23: అఖిల భారత యువజన సమైక్య, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక రామకృష్ణారావుపేట లో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఆరుగుల భవాని లు పూలమాల ఆవిష్కరణ చేయడం జరిగింది.

కామిరెడ్డి బోడకొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని ఖత్కార్ కలాన్ అనే గ్రామంలో భగత్ సింగ్ జన్మించారని, మహాత్మా గాంధీ పిలుపులో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారని, 1919 లో జరిగిన జలియన్ వాలీబాల్ ఉదాంతంలో నేను ఉద్యమ స్ఫూర్తిని పెంచిందని, లహర్ లోని నేషనల్ కాలేజీలో విద్యాభ్యసించా రని, 23 ఏళ్ల వయసులోనే 1931 మార్చి 23న రాత్రి సమయంలో దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేశారని, అటువంటి మహానుభావుడు భగత్ సింగ్ ఆసియాస్ఫూర్తిని యువతి, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని, ఉద్యోగ ప్రాధాన్యత, నిరుద్యోగం రూపుమాపుట, ఉద్యోగ అవకాశాలు కల్పించుట పరిశ్రమల్లో స్థానికులకు అవకాశం కల్పించుట తదితర పోరాటాల్లో యువత కీలక పాత్ర పోషిస్తూ ముందుకు రావాలని ఆయన అన్నారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ విప్లవం అనే కత్తికి యువత ఆలోచనలతో పదును పెట్టాలని, తిరుగుబాటు అనేది ఒకవిప్లవం కాదని, అది చివరి ముగింపునకు నాంది పలుకుతుందని, యువత ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం లేదని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్ధకత నిజమవుతుందని ఆయన అన్నారు. జీవితంలో తన సొంత భుజాలపై తానే బ్రతకాలని, ఇతర భుజాలను అంత్యక్రియలకు మాత్రమే వాడాలన్న మాట భగత్ సింగ్ స్ఫూర్తి మరువలేనిదని, భగత్ సింగ్ ఆసియాస్ఫూర్తికి అనుగుణంగా యువతనిలిచినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కే. విశ్వనాథ్, సుమ, సురేష్, కిరణ్, ప్రకాష్, గోపి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhagat Singh's spirit of