TRINETHRAM NEWS

అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా దద్దు సురేష్ యాదవ్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 17 : (యూనియన్లకు అతీతంగా) ప్రెస్ క్లబ్ కూకట్పల్లి అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ చిత్తారమ్మ ఆలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ (యూనియన్లకు అతీతంగా) అధ్యక్షులుగా ఎర్రయాకాయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులందరికి సంక్షేమ పథకాలు అందజేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పివి నాగరాజు కుమార్, కిషోర్ చారి, సలహాదారులు మధుసూదనాచారి, అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా దద్దు సురేష్ యాదవ్, కోశాధికారిగా బెల్లం శంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా శ్రీరామ్, ధనుంజయ్ చారి, ఆనందరావు, జాయింట్ సెక్రెటరీ నగేష్, సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చందు, లక్ష్మి, నాగమణి,కార్యవర్గ సభ్యులుగా రవీందర్ రెడ్డి, పబ్లిసిటీ సెల్ కార్యదర్శిగా దుర్గాప్రసాద్, నియమితులయ్యారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సురేష్, మహేందర్, చంద్రశేఖర్, అంజి బాబు, వీరారెడ్డి, ,వినీల్ గౌడ్, శ్రీధర్, రంజిత్, ప్రభాకర్ రెడ్డి, కూరాకుల నరసింహారావు, మనోహర్, హేమంత్, సునీల్ వినీల్ గౌడ్, వీరేంద్ర, రవీందర్ రెడ్డి, సురేష్,తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Press Club KukatPally