Better facilities for pregnant women in the hospital….District Collector Koya Harsha
*ల్యాబ్ పరీక్ష ఫలితాలు వేగవంతంగా అందించేలా చర్యలు
*మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, సెప్టెంబర్-17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపెల్లి పట్టణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగం, మందుల విభాగం, చిన్నపిల్లల వైద్య విభాగాలను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, 3 సీటర్ బెంచ్ లను వెంటనే అవసరమైన మేర కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆస్పత్రిలో నిర్వహించే ల్యాబ్ పరీక్షల ఫలితాలు వేగవంతంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆశా కార్యకర్తలతో ముచ్చటించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App