TRINETHRAM NEWS

Trinethram News : తెలుగు మాసాల్లో చిట్టచివరిది ఫాల్గుణం. ఈమాసం నరసింహస్వామి ఆరాధనకు ప్రత్యేకించినది. అన్ని ప్రసిద్ధ నృసింహ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. నాలుగోరోజును తిలచతుర్ధి అంటారు. ఆనాడు నువ్వులతో కలిపి వండిన అన్నంతో హోమం చేస్తే సర్వవిఘ్నాలు నశిస్తాయి. ఆనాడు పుత్రగణపతి వ్రతం కూడా ఆచరించాలి. పంచమినాడు అనంతపంచమి వ్రతాన్ని ఆచరించాలి.

ఫాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్లపక్షంతో ప్రారంభించి ఫాల్గుణ బహుళ ద్వాదశి వరకు నృసింహారాధన చేయాలి. ఫాల్గుణ పూర్ణిమనాడు హోళీ వస్తుంది. ఆనాడు రాబోయే వసంతానికి స్వాగతం చెబుతూ వసంతోత్సవాలు జరుపుకుంటారు..