TRINETHRAM NEWS

ఎంపి గా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ కి చేసింది శూన్యం – బీ ఆర్ యస్ యూత్ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజు యాదవ్

ఈరోజు కరీంనగర్ లోని బీఆర్ యస్ యూత్ కార్యాలయంలో జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది.. ఈ సందర్బంగా జక్కుల నాగరాజు గారు మాట్లాడుతూ….

పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరోసారి కరీంనగర్ ఎంపీగా పోటీ చేయడానికి కోసం మీటింగులు నిర్వహిస్తూ బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ, ఈ సారి 350 సీట్లు గెలిచి తిరిగి మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నావ్ కదా, 350 గెలిచే వాళ్ళలో నీలాంటి వాళ్లు పార్లమెంట్లో అవసరమే లేదు

272 సీట్లు గెలిస్తే మోడీ ప్రధానమంత్రి అవుతారు నీలాంటి వాళ్ళ అవసరం ఉండదు

నీలాంటి వాళ్లకు ఓటేస్తే వృధా అవుతుంది ఓటు

ఎంపీగా కరీంనగర్ ప్రజలు నిన్ను గెలిపిస్తే కనీసం ఒక్కసారైనా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏదైనా ఒక్క సమస్య పైన, కరీంనగర్ అభివృద్ధి పైన పార్లమెంటులో మాట్లాడినవా? ఒక్క రూపాయి నిధులైన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చావా?

కరీంనగర్ ప్రజలు ఒక గొప్ప స్థానాన్ని కల్పిస్తే ఇప్పటికీ గల్లి రాజకీయమే చేస్తున్నావ్, మతం కులం పేరు మీద రాజకీయాలు చేస్తూ కరీంనగర్ పరువు తీస్తున్నావ్.. ఏ ఒక్క సబ్జెక్టు పైన కూడా కనీస అవగాహన లేని బండి సంజయ్ మా ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది.. ఏ ఒక్కరి సమస్యను పట్టించుకోనేలేదు, పుస్తెలు తాకట్టు పెట్టి నామినేషన్ వేసానని ప్రకటించిన నువ్వు ఇప్పుడు నీ ఆర్థిక వ్యవస్థ అందరికి తెలుసు. యువకుల, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటావు. రెచ్చగొట్టుడు మాటలు తప్ప ఏ ఒక్క యువకుడి జీవితానికైనా వెలుగునింపావా?

గత 10 సంవత్సరాలుగా నరేండ్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే, అందులో తొలి ఐదు సంవత్సరాలు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు, తదుపరి ఐదు సంవత్సరాలు ఎంపీగా బండి సంజయ్ గారు ఉన్నారు.

కేంద్రంలో బిజెపి అధికారంలో ఉనప్పటికి కరీంనగర్ పార్లమెంటుకు కేంద్రం నుండి కనీసం ఒక ప్రాజెక్టు తీసుకురాలేదు, మోడీ నా భుజం తట్టాడంటావు కదా, కనీసం ఒకటో రెండో యువకులు విద్యార్థులు బాగుపడే ప్రాజెక్టు ఎందుకు మంజూరు చేయించలేకపోయావు? కనీసం అవి అడిగే దమ్ము ఉందా? ఉంటే ఏం ప్రయత్నాలు చేసావో చెప్పు.

ఢిల్లీలో అవగాహన ఉన్న నాయకుడు, పనిచేసే నాయకుడు వట్టి మాటలు చెప్పే నాయకుడు కాదు, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసే నాయకుడు మన వినోద్ కుమార్ గారు

బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులుగా గెలిచిన తర్వాత (2014-18 వరకు) కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ నగరానికి ఎలిజిబిలిటీ లేకున్నా కేంద్రంతో కొట్లాడి ఒప్పించి స్మార్ట్ సిటీ హోదాను సాధించి.. 1000 కోట్ల నిధులను తీసుకొచ్చి కరీంనగర్ ని అందమైన నగరంగా తీర్చిదిద్దింది వినోద్ కుమార్ గారు..

చిందర వందరగా ఉన్న కరీంనగర్లోని ప్రతి రహదారి ఇవాళ్ళ అద్భుతంగా అయిందంటే బోయినపల్లి వినోద్ కుమార్ గారి శ్రమ వల్లనే. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 2014 ముందు జానెడు జాతీయ రహదారి లేదు దానికి పక్కా ప్రణాళిక చేసి నాలుగు జాతీయ రహదాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి సాధించారు. మొదటిది జగిత్యాల- కరీంనగర్- హుజురాబాద్ -వరంగల్ వరకు, రెండవ జాతీయ రహదారి కరీంనగర్- సిరిసిల్ల- కామారెడ్డి- పిట్లం వరకు, మూడవ జాతీయ రహదారి సిరిసిల్ల -సిద్దిపేట జనగామ -సూర్యాపేట వరకు అలాగే నాలుగో జాతీయ రహదారి ఎల్కతుర్తి- హుస్నాబాద్-సిద్దిపేట వరకు.

అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిరిసిల్ల-కరీంనగర్ ప్రజల కలల ప్రాజెక్ట్ కొత్తపెల్లి-మనోహరాబాద్ రైల్వే లైను కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా, ఎట్టకెలకు మంజూరు చేయించి మోడీ మరియు కేసీఆర్ గార్లతో శంకుస్థాపన చేయించారు. ఇప్పటికే ఈ పనులు సిద్దిపేట వరకు పూర్తయినాయి ఇంకొక్క సంవత్సరంలో కరీంనగర్ కు సికిందరాబాదు నుంచి రైలు రాబోతుంది.

ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉన్న ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు నిధులు తీసుకొచ్చి పూర్తి చేయించారు, అపోలో రిచ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరీ సైతం వినోద్ కుమార్ గారి చొరవనే.

కరీంనగర్ యువకులను దృష్టిలో పెట్టుకొని సింథటిక్ ట్రాక్ ఏర్పాటు, విద్యార్థుల కోసం అంబేద్కర్ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్, ఐటీ టవర్ ఏర్పాటు, ఉర్దూ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు, సైన్స్ సెంటర్ ల ఏర్పాటు తో పాటు వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని దేశంలోనే నెంబర్ వన్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మీ కేంద్ర ప్రభుత్వం చేతనే మన్ననలు అందుకున్నారు.

తన పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి కోసం కృషి చేసింది వినోద్ కుమార్ గారు, కానీ నీవు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కనబడలేదు అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీ చేస్తా అని మిగతా ఏ నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు. తీరా ఓడిపోవడంతో ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెడుతున్న బండి సంజయ్ గారూ, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ప్రజలలోకి ఓట్ల కోసం వస్తే ఎక్కడికక్కడ నిలదీస్తారు. కులం మతం పేరు మీద వ్యవస్థను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నీకు ఢిల్లీ రాజకీయం సెట్ కాదేమో ఇదే గల్లీ రాజకీయాలు సరైనవేమో అని నా ప్రగాఢ నమ్మకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి శ్రీనాథ్ గౌడ్, బీఆర్ యస్ వి జిల్లా కో ఆర్డినేటర్ ద్యావ మధుసుదన్ రెడ్డి, సాయి కృష్ణ, అనిల్ , సముద్రాల ఓంకార్, ప్రభాకర్, అజయ్, శ్రీనివాస్, రాజశేఖర్, , వంశీ, శ్రీకాంత్, బాలకృష్ణ శేఖర్, తదితరులు పాల్గొన్నారు