
విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్, సత్తి
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. కులవివక్షత నిర్మూలన కోసం విద్యార్థి దశ నుండి కృషి చేసిన గొప్ప సామాజిక నాయకుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో దుప్పలపూడి నందు ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కుల వివక్షత కోసం విద్యార్థి దశ నుంచి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి గొప్ప సంఘసంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.శనివారం బాబు జగ్జీవన్ రామ్, జయంతిని పురస్కరించుకుని దుప్పలపూడి గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామ సతీష్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ భారతదేశ ప్రభుత్వంలో కార్మిక శాఖ, రైల్వే శాఖ, రవాణా శాఖ, కమ్యూనికేషన్ శాఖలతో పాటు ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. భారత రాజ్యాంగ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ఒక సభ్యునిగా కూడా పనిచేశారు. విద్యార్థి దశనుండే కుల వివక్షతను నిర్మూలించాలని కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
వీరి వెంట సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, (అనపర్తి వ్యవసాయ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్) , నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళి) (వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి గ్రామ కమిటీ కన్వీనర్) , వల్లభశెట్టి రామసతీష్ (వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు) , కోట సత్తయ్య ,ఉండ్రాస్కు బండరాజు, కోట ఏసు, కొరత సామేలు ,ఉండ్రాజపు వెంకట్రావు ,ఉండ్రాజపు పండు , పెనుముచ్చి వెంకన్న ,కాకర దోర్లమ్మ , పెందుర్తి మంగయ్యమ్మ ,తోట మరియమ్మ ,పెనుముచ్చి రాణి , పెనుముచ్చి శ్రీను ,మెంతులు ముత్తయ్య (రాజు) , సిలకముర్తి శ్రీనివాస్, వాడ్రేపు శేఖర్ ,ఉంగ కృపారావు , ఉంగ జయరాజు ,నాగవరపు శేషారావు ,కందికట్ల శేఖర్ , పండ దేవయ్య , నందుకొల్ల శ్రీను , వల్లభశెట్టి శ్రీను ,పంచికట్ల కొండయ్య ,పెనుముచ్చి సుబ్బారావు తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
