TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బాలిక సాధికారతపై అవగాహన. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బుధవారం పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా డిండి ఎస్సై రాజు హాజరై మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుండి ఉగాది కాల్ చేయడం మరియు ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ఖాతాల దుర్వినియోగం మరియు నూర్ కాల్స్ పట్ల అవగాహన కల్పించారు.
ఎవరైనా మోసానికి గురైనట్లయితే ధైర్యంగా 1930 నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, శ్రీలత, బిచ్చ య్య, రమ, సుశీల, రామారావు, విజయ్,, చెన్నయ్య, సోమయ్య, రవి, కృష్ణ, జ్యోతి, రూంషా, సందీప్, రమేష్, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ వెంకటేష్, వీరాస్వామి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness program for students