ఎన్ సి సి “సి” సర్టిఫికెట్లు అందజేత…. ప్రకాశం జిల్లా.
Trinethram News : ప్రకాశం జిల్లా : కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలలో విద్యార్థులకు ఎన్.సి.సి “సి”సర్టిఫికెట్లను బుధవారం నాడు అందజేయడం జరిగింది. కళాశాల విద్యార్థులైన సిహెచ్ మధు చిరంజీవి, డి.మహమ్మద్ రఫీ, ఎస్ భూలక్ష్మి, ఎం పుష్పకోమల, పి సంధ్య లకు ఎన్ సి సి 34 A బెటాలియన్ కమాండర్ వి.మోహన్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎల్ఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష, కళాశాల అధ్యాపకులు భూపని నారాయణ, జి ముక్తేశ్వరరావు, జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, షేక్ షరీఫ్, ఏనుగుల రవికుమార్, ఎం.శ్రీనివాసరెడ్డి, భువనగిరి అరుణ కుమారి, పాలిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App