TRINETHRAM NEWS

అల్లూరు జిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 2: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం,చిన్న గడ్డ గ్రామంలో భర్త లక్ష్మయ్య మూడు నెలల క్రితం చనిపోతే అధికారులు పెన్షన్ నమోదు చేయగా మూడు నెలల కలిపి అక్షరాల రూ.12000 వితంతువు పెన్షన్ కూటమి ప్రభుత్వం మంజూరు చెయ్యడం జరిగింది.జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంచి పెన్షన్ దారులకు ఆనందాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వం కి ధన్యవాదములు తెలియజేశారు.

అలాగే దివ్యాంగుల ఫించన్ రూ.6 వేలకు పెంచడం, పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్, కిడ్నీ తలసీమియా వంటి దీర్జకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.10వేలు ఫించన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి సాధ్యం అని ఆనందం వ్యక్తం చేశారు… కూటమి ప్రభుత్వం సమాజంలోనీ అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని, పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనేది సమాజంలోనీ పేద మరియు బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్దులు మరియు బలహీనులు, వితంతువులు మరియు వికలాంగుల కష్టాలను తగ్గించడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఒక ప్రధాన సంక్షేమ చర్య, ఈ విస్తృత లక్ష్యాన్ని సాధించడానికి, సవాలుతో కూడిన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం పెదలకు అండగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,

అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.టిడిపి సీనియర్ నాయకులు రిమెల ఆనంద్ మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, సంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగమార్పిడి మరియు డప్పు కళాకారులు, సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని మంజూరు చేస్తూ పెద మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమించి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం కి ధన్యవాదములు తెలియజేశారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమాలను, ప్రజలకు సంక్షేమ, ఫలాలు ప్రజలకు అందేలా, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెలిపేందుకు చిత్త శుద్ధితో బాధ్యతగా కృషి చేసి కూటమి నాయకత్వ విది విధానాలు ప్రజలకు తెలియజేస్తామని వివరణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చిన్న ముర్ల భాస్కరరావు, మర్రి మంగ్లు, కిముడు అప్పారావు పాంగి సాధుబాబు, హెల్పర్ అసిస్టెంట్ లిల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As per the promise