TRINETHRAM NEWS

గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు..న్యూ ఇయర్ కావడంతో రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ కసరత్తు మొదలు..

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అవుతోన్న జగన్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రక్రియకు రెండు రోజులు బ్రేక్‌పడగా మంగళవారం తిరిగి ప్రారంభంకానుంది.

రెండు రోజుల విరామం తర్వాత వైసీపీ మళ్లీ కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అయిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్‌ను కూడా ఒకేసారి ప్రకటించేస్తారనే టాక్‌తో నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఇక ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు టికెట్ టెన్షన్‌ పట్టుకుంది. 175టార్గెట్‌తో ముందుకెళ్తున్న వైసీపీ.. గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి పెట్టింది.

చిన్న బ్రేక్‌ తర్వాత ఇవాళ్టి నుంచి మళ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ నేతల్లో నెలకొంది. రెండో లిస్ట్ ప్రకటనకు బ్రేక్ పడటం.. ఇదే గ్యాప్‌లో న్యూఇయర్ కలిసి రావడంతో.. బాస్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలకు మంచి టైమింగ్ కుదిరింది. దీంతో మరోసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ అధినేతను కలిశారు కొందరు నేతలు.