క్రాంతి యువజన సంఘం కమ్యూనిటీ హాలును ప్రారంభించిన అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలందరూ సూబిక్షంగా ఉండాలి : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు .అర్ధ. సుధాకర్ రెడ్డి
వికారాబాద్ మున్సిపల్ ఆలంపల్లి లో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలోనూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొకటిగా అమాలు చేస్తున్న *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ప్రజలందరూ అండగా ఉండాలని రానున్న రోజుల్లో వికారాబాద్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని విద్యా, ఉద్యోగ,ఉపాధి రంగాల్లో వికారాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామస్వామి , కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ అదేవిదంగా క్రాంతి యువజన సంఘం అధ్యక్షులు ..నాగేష్ ,సంఘం సభ్యులు నాగరాజు , తలారి శ్రీనివాస్, గోపాల్, యాదయ్య, మహేందర్, అంజయ్య,T భాస్కర్, జ్ఞానేశ్వర్, ప్రసాద్, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App