TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగులమ్మ బస్తి కాలనీలో రూ.35.00 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(యు జి డి) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఈ రోజు మొగులమ్మ బస్తి కాలనీ లో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని గాంధీ తెలియచేసారు, అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని గాంధీ తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని,కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

మొగులమ్మ బస్తి కాలనీ లో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు ,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు యు జి డి పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, యు జి డి వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని పిఎసి చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వివరాలు

1.మొగులమ్మ బస్తి కాలనీ లో రూ. 35.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(యు జి డి) నిర్మాణం పనులకు

పైన పేర్కొన్న యు జి డి పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్ ఝాన్సీ మరియు నాయకులు కార్యకర్తలు,కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arekapudi Gandhi lays foundation