TRINETHRAM NEWS

అంగరంగ వైభవంగా అరకు చలి ఉత్సవాలు ముగింపు.

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న అరకు చలి ఉత్సవాలు, మూడురోజుల పాటుగా అంగరంగ వైభవంగా అధికారులు, నాయకులు, గిరిజనులతో,కలిసి జరిపించారు,చలి ఉత్సవాలు, గిరిజన ఆచార, సంప్రదాయ, ఉట్టిపడేలా జరిగాయి, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా, అరకు చలి ఉత్సాహాం జరిగింది, చలి ఉత్సవాలు లాస్ట్ రోజు కావడంతో, పర్యాటకులు, మరియు గిరిజనులు భారీ ఎత్తున ఉత్సవాలు తిలకించడానికి తరలివచ్చారు. ఇందులో భాగంగా అరకులోయ పట్టణంలో రంగోలి పోటీలు,

దింసా సాంస్కృతిక కార్యక్రమాలు, కాఫీ రుసులు, ఫ్యాషన్ షో, సినీ, టీవీ కళాకారులతో ప్రత్యేక షోలు, సుంకరమెట్ట కాఫీ తోటలో అరకు ట్రక్కింగ్. అరకు అందాలు చూడటానికి హెలికాప్టర్ రైడింగ్, 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సాంప్రదాయ డప్పు వాయిద్యాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి, ముఖ్య అతిథులు ప్రసంగాలతో అరకు చలి ఉత్సవాలు, ఉత్సాహంగా ముగించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App