
గ్రామసభల్లో ఆమోదం..
త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట పట్టణ, రూరల్ పరిధిలో వ్యవసాయం కు అనుకూలం గా లేని భూముల్లో ఆక్వా చెర్వులు తవ్వెందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని మండపేట మత్స్య శాఖ అధికాారి వీళ్ళ రమణారావు పేర్కొన్నారు.
మండపేట పరిధిలోని మండపేట మున్సిపాలిటీ ఏరియాలో సచివాలయం 7, 9 ల లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మండపేట మండలం లోని తాపేశ్వరం, ఇప్పనపాడు కేశవరం గ్రామాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీళ్ళ రమణారావు మాట్లాడుతూ ఆక్వాజోనేషన్ సర్వే చేస్తున్నామన్నారు. గతంలో ప్రచురించిన గెజిట్ లో నమోదు కాని వాటిని నమోదు చేశామని చెప్పారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని చోట్ల ఆక్వా చెరువులు తవ్వుకొవచ్చన్నారు. వీటికి అనుకూలంగా ఉన్న భూములను గ్రామస్థాయి కమిటీ( వి ఎల్ టి) ల ద్వారా సర్వే చేసమన్నారు.
ఆ భూముల వివరాలను కలెక్టర్ కు నివేదిక అందజేసినట్లు చెప్పారు. ఆయన ఆదేశాల ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించినట్లు చెప్పారు. పొటెన్షియల్ పరిధిలోని కి తీసుకు వచ్చేందుకు గ్రామ సభలో ఆమోదించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి కమిటీ డీఎల్సి వారికి సిఫార్సు చేసేందుకు ఈ గ్రామసభలు నిర్వహించామన్నారు. ఆయా గ్రామ సభల్లో కార్యక్రమంలో మండపేట మునిసిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ళ నారయ్య బాబు, కౌన్సిలర్ కాళ్లకూరి స్వరాజ్య భవాని, తాపేశ్వరం సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి, ఇప్పనపాడు సర్పంచ్ కుంచే వీరమణి ,ఉపసర్పంచ్ కుంచే దుర్గాప్రసాద్, రెవెన్యూ ఆర్ ఐ వా, వ్యవసాయ శాఖ ఏవో ఏసుబాబు, ఇరిగేషన్ ఏఈ సయ్యద్ అబ్దుల్ అజీజ్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రమణారావు మత్స్యశాఖ సహాయకులు కృష్ణ కిషోర్, ఆయా గ్రామాల కార్యదర్శులు వీఆర్వోలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
