
అల్లూరి జిల్లా అరకులోయ మార్చి 25 త్రినేత్రం న్యూస్: 31 వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మన్యం జిల్లా పార్వతీపురంలో 23-03-2025 ఆదివారం నిర్వహించారు ఈ పోటీలకు అనేక జిల్లాల నుండి బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొన్నారు, ఈ పోటీలు ఎనిమిది జనరల్ గాను, మాస్టర్స్ రెండుగాను, మెన్ ఫిజిక్ ఒకటిగాను, విభజించి పోటీ లు నిర్వహించారు. ఈ కాంపిటేషన్లో అల్లూరు జిల్లా అరకువేలి మండలానికి చెందిన, పిన్నింటి అప్పారావు. మాస్టర్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకున్నారు.
ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రథమ స్థానం దక్కించుకున్న పిన్నింటి అప్పారావుకి, సీల్డ్, మెడల్, తో పాటు ప్రైజ్ మనీ బహుకరించారు. అప్పారావు మాట్లాడుతూ.మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలలో మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, మరియు గౌరవంగా ఉందని కొనియాడారు. అలాగే అల్లూరి జిల్లాలో ఉన్న యువత కూడా వ్యాయామాలు చేయాలని, ఆరోగ్య చిట్కాలు పాటించాలని, అలాగే బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని అల్లూరి జిల్లాకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావాలని ఆయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
