TRINETHRAM NEWS

AP ‘Padhi’ recounting and reverification results released

Trinethram News : నేటి నుంచి ఏపీ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్కూల్స్‌ లాగిన్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

మే 30 వరకు వెబ్‌సైట్లో ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

విద్యార్ధులను ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు.

ఇక ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి.

ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్‌ ఇయర్‌కు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులందరూ తమతోపాటు తప్పనిసరిగా హాల్‌ టికెట్లు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP 'Padhi' recounting and reverification results released