TRINETHRAM NEWS

Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.

అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం. త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ ఆమోదం.

యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్ కు ఆమోదం. రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదం.

నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Cabinet Meeting