WhatsApp Image 2024 03 27 at 14.08.47
Trinethram News : Mar 27, 2024,
వాట్సాప్‌లో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లపై పని చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఎన్నో కొత్త ఫీచర్లను పరీక్షించింది. ఇప్పుడు మరొక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇప్పుడు లింక్ ప్రివ్యూ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత మీరు ఎవరితోనైనా షేర్ చేస్తున్న లింక్ ప్రివ్యూ కనిపించాలా వద్దా అనేది మీరు మాత్రమే నిర్ణయించగలరు. ప్రస్తుతం బీటా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేశారు.
