TRINETHRAM NEWS

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి తేదీల ప్రకటన..!!

Trinethram News : తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం శుక్రవారం(నవంబర్ 08) విడుదల చేసింది. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

ఈ గడువు దాటితే, ఆలస్య రుసుముతో కలిపి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2వ తేదీ వరకు,
రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు,
రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.
రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125, మూడు లేదా అంతకంటే తక్కువ పేపర్లు ఉన్న వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ అభ్యర్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.60 చెల్లించాలి. తల్లిదండ్రుల ఆదాయం తక్కువ గల వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కలదు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App