TRINETHRAM NEWS

నిర్వాహకులు నాణ్యత పాటించాలి

అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ లో ఎమ్మెల్యే వేగుళ్ళ
Trinethram News : మండపేట. ఎంతో మంది నిరుపేదలు అన్నా క్యాంటీన్ ను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారని, ప్రజలందరికీ నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట ఏడిద రోడ్డు లోని అన్నా క్యాంటీన్ ను శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్ కు విచ్చేసిన పేద ప్రజలతో కలసి ఆయన భోజనం చేశారు.

ప్రతి రోజు బోజనాలు ఎలా ఉంటున్నాయో అక్కడ బోజనాలు చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే నాణ్యతను ఎప్పటికీ కొనసాగించాలని ఆదేశించారు. అప్పుడప్పుడు తాను పరిశీలనకు ఇక్కడకు వస్తానని, నాణ్యతలో మార్పులు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులకు తెలిపారు. అలాగే అక్కడ షెడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla