
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ను సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని,రెండు రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.
రాత్రి సమయంలో ఆఫీస్ ముందే వంటా వార్పు చేసి అక్కడే నిద్రించడం జరిగింది మాకు పనికి తగ్గ కనీస వేతనం, చెల్లించాలని మినీ అంగన్వాడీల జీతాలు వెంటనే ప్రభుత్వాలు చెల్లించాలని, రిటర్మెంట్ అయినా టీచర్స్ కు ఆయాలకు రిటర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఆన్లైన్ విధానం రద్దు చేయాలని అంగన్వాడి టీచర్లు కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
