
నిమిషానికి 90 వేలు
Trinethram News : బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం ఎంత వసూలు చేస్తున్నారో వివరించారు. ఈ క్రమంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసుల ముందు ఉంచారు.
పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తన లాయర్‌తో కలసి వచ్చిన విష్ణుప్రియ పోలీసులు అడిగిన సమాచారం అందజేశారు. ఆమెను క్వశ్చన్ చేసిన ఖాకీలు స్టేట్మెంట్ రిక్రాడు చేశారు. ఈ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాను 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు విష్ణుప్రియ పోలీసులకు వివరించారు. నిమిషం వ్యవధితో చేసే ఒక్కో వీడియోకు రూ.90 వేల వరకు వసూలు చేసినట్టు పేర్కొన్నారు.
దాదాపు మూడు గంటలకుపైగా సాగిన విచారణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భాగంగా భారీగా డబ్బులు వచ్చినట్టు విష్ణుప్రియ అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు వారికి అందజేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ఆమె ఫోన్ కూడా సీజ్ చేశారని తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
