అనపర్తి నియోజకవర్గ, రాజకీయాలలో ఒక ప్రత్యేకత ఉంది, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అది, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,కే సాధ్యం అయ్యింది.
డాక్టర్, అనేక విలక్షణమైన లక్షణాలను కలిగి ఉన్న గొప్ప నాయకుడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన పనులు, ఆయన ప్రజల పట్ల చూపించే అంకితభావం అన్ని ఆయన నాయకత్వాన్ని బలపరిచే అంశాలు.
డాక్టర్, కార్యకర్తలతో కలిసిపోయి వారికి ధైర్యం ఇవ్వడం, వారి కష్టాల్లో అండగా నిలబడటం, ఎన్నికల తర్వాత కూడా ప్రజల మధ్య ఉండటం ఈతరం నాయకులకు ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ఆయన అనేక విధాలుగా ప్రజల హృదయాల్లో సముచిత స్థానం సంపాదించుకున్నారు.
“పది రూపాయల డాక్టర్” గా పేరు సంపాదించి, రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన గురించి మంచి మాటలు చెప్పడం, ఒక మంచి నాయకుడి స్వభావాన్ని సూచిస్తుంది.
బలభద్రపురం ఎమ్ .ఎస్ .ఆర్ . ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశం, మరియు డాక్టర్, ఇంటి వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకలు వంటి కార్యక్రమాల్లో జన ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమాలు స్థానిక రాజకీయ దృశ్యంపై ప్రభావం చూపించాయి.
ఈ కార్యక్రమాలు నియోజకవర్గ రాజకీయ దృశ్యంపై గట్టి ప్రభావం చూపించాయి. వాటిని చూసి ఓర్వలేక కొన్ని మీడియా సంస్థలు డాక్టర్,పై, ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
నిజమైన, నిష్పక్షపాతమైన సమాచారం అందించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది.కానీ, ఒక వైపు వ్యవహరించడం, ప్రతిపక్ష నాయకులపై కావాలని తప్పుడు సమాచారం ప్రసారం చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం.
ప్రతిపక్ష నాయకులు వారి నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడం, పార్టీ సమావేశాలు నిర్వహించడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన ప్రజలతో వారి సంబంధం పెరిగినట్లు కనపడుతుంది. అందువల్ల కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్ష నాయకులపై తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. వీరి వెనక ఎవరు ఉన్నారో కూడా ప్రజలు గ్రహిస్తారు.
ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా, ప్రత్యామ్నాయ మీడియా వంటివాటితో తమకు అవసరమైన సమాచారం పొందగలుగుతున్నారు. ఈ మారుతున్న పరిస్థితుల్లో, నిజమైన సమాచారం అందించడమే మీడియా సంస్థలకు నమ్మకాన్ని పెంచే మార్గం.
కూటమి నాయకులు ప్రతిపక్షంపై చేసే దాడులను సమర్థంగా ఎదుర్కొనడంలో, ప్రతిచర్య చూపించడంలో అనపర్తి నియోజకవర్గం ముందుండటం డాక్టర్, నాయకత్వ శక్తిని ప్రతిబింబిస్తోంది.
అనపర్తి నియోజకవర్గం లో డాక్టర్, ఓటమి గురించి ప్రస్తుతం ప్రజలలో ఉన్న అసంతృప్తి, వారి అభివృద్ధి కోసం చేసిన కృషి పట్ల అవగాహన స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్, ప్రజలతో కలసి, వారి సమస్యలను తెలుసుకుని, వెంటనే చర్య తీసుకునే తత్వం ఉన్న నాయకుడిగా గుర్తించబడ్డారు.
ఓటమి వచ్చినా, ఆయన చేసిన పనులు ప్రజల మనసులలో బలంగా నిలిచాయి. నిజంగా, ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు.!!!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


