
మిగిలిన బాణసంచా భూమిలో పాతిపెట్టేందుకు ఏర్పాట్లు
Trinethram News : అనకాపల్లి జిల్లా : కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్‌లో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది కైలాసపట్నానికి చెందిన వారు ఉండటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల్లో గ్రామస్తులు పాల్గొన్నారు.
బాణసంచా పేలుడు ప్రాంతంలో అగ్నిమాపకశాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ పర్యటించారు. ధ్వంసమైన భవనాలను పరిశీలించి అనుమతులు, తయారీదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ప్రతాప్ చెప్పారు. ఘటనాస్థలిలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాణసంచా తయారీకి సిద్ధంగా ఉంచిన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బాణసంచాను భూమిలో పాతిపెట్టే ఏర్పాట్లు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
