
AP: తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ‘పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? నేను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు గంజాయి డాన్ అని మీ పార్టీలో ఉన్న గంటా చెప్పలేదా? లోకేష్ కి ఇష్టమైన పప్పుని కుండలో పెట్టి సిద్ధం చేశా. సాహసం చేసి ఎవరైనా తీసుకెళ్లండి’ అంటూ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
