TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం, మార్చి 20: ఎన్నికల కోడ్ కారణంగా వివిధ వర్గాలకు ఇవ్వవలసిన నివాస, జనన, మరణ, కుల, ఆదాయ తదితర పత్రాలను నిలిపివేయడం సరికాదని, వాటికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు జె రవి బుధవారం విజ్ఞప్తి చేశారు. ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వుండడం వలన ధృవీకరణ పత్రాలను నిలిపివేయడం సరికాదని తెలిపారు. వాటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిబంధనలకు లోబడి ఇచ్చే మార్గం చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల కోడ్ సుమారు మూడు నెలలు వుంటుందని, దానివలన విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. పరీక్షలు తర్వాత స్కూళ్లు, కాలేజీలు ప్రారంభ మవుతాయని, అప్పుడు వారి అడ్మిషన్లకు మరింత సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిలిపి వేసిన స్పందన కార్యక్రమం కూడా నిబంధనలకు లోబడి కొనసాగించాలని, తద్వారా పేదలు, అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.