TRINETHRAM NEWS

తేదీ : 27/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా సాగింది.
సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి అభ్యర్థి గెలవాలన్నా లక్ష్యంతో నాయకులు పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి నాయకులు ప్రత్యర్థి వర్గానికి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అభ్యర్థి గెలుపుకు ఉపసర్పంచ్ ఎన్నికకు ప్రత్యర్థి వర్గం సిద్ధమవుతున్న సమాచారం అందుకున్న మండల పార్టీ అధ్యక్షులు జాస్తి.వెంకటేశ్వరరావు. ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. కూటమి అభ్యర్థి అయిన జాస్తి. శ్రీధర్ బాబుకు మద్దతు కూడగట్టడం తో సఫలీకృతమయ్యారు.

ఉదయం పంచాయతీ కార్యాలయంలో ఈ.ఓ.పి. ఆర్. డి భవాని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన యువ నాయకులు 1వవార్డు సభ్యులు అయినా జాస్తి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉండగా 15 వార్డుల మంది సభ్యులు
ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. వెంకట నరసింహపురం వార్డు సభ్యులైన రాజు ఈ ఎన్నికకు రాలేకపోయారు. సర్పంచ్ చేబ్రోలు మౌనికతో సహా 14 మంది వార్డు సభ్యులు శ్రీధర్ బాబును ఉప సర్పంచ్ దగ్గరవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన శ్రీధర్ బాబును మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాస్తి . వెంకటేశ్వరరావు, గన్నవరం ఎంపిటిసి సభ్యులు సొంటి. కిషోర్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పలగాని. బాలకృష్ణ , కార్యదర్శి మన్నే. సుబ్బారావు , నీటి సంఘం అధ్యక్షులు జాస్తి. విజయ్ భూషణ్ కుమార్ , జిల్లా కార్యదర్శి జూపల్లి. రమేష్,రాష్ట్ర మహిళా కార్యదర్శి మండవ.

లక్ష్మి, గ్రామటిడిపి మాజీ అధ్యక్షులు రాజులపాటి. శ్రీనివాస్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు మండవ. అన్వేష్ , మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అభిలాజ్ ఐ టిడిపి మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ బోర్రా. ఓం సాయి. మండల తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షరాలు చిక్కవరపు నాగమణి, అజ్జంపూడి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షురాలు దోబ .శాంతమ్మ, గ్రామ పెద్దలు వీరబాబు, మరీదు. రాంబాబు, బొంకుర. అప్పారావు, అన్నె. శ్రీనివాసరావు, వడ్డెర సంఘం అధ్యక్షులు గొడ్డల .శ్రీను, వల్లప్ప శ్రీను, కేశవులు తదితరులు అభినందనలు తెలిపారు. కూట మి నాయకులు , కార్యకర్తలు సానుభూతిపరులు భారీ ర్యాలీగా పంచాయతీ కార్యాలయం చేరుకొ ని ఉప సర్పంచ్ శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alliance leaders win as