TRINETHRAM NEWS

తేదీ : 26/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం ఎంపీ బాల సౌరికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కోట్ల రూపాయలు కేటాయించి నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ వల్ల ప్రయాణికులు కష్టాలు మరింత పెరిగాయని, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకి శెట్టి. బాలాజీ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నుండి విజయవాడకు రైల్వే డబల్ లైనింగ్ వేసిన ప్రయాణం సమయం ఏమాత్రం తగ్గడం లేదని అన్నారు. ప్రతిరోజు విశాఖపట్నం నుండి మచిలీపట్నం వచ్చే రైలు గుడివాడ నుండి మచిలీపట్నం రావడానికి 35 మైళ్ళకి రెండు గంటల సమయం పడుతుంది అన్నారు.

భీమవరం లాంటి అన్న పట్టణంలో రెండు రైల్వేస్టేషన్లో రెండు లిఫ్టులు ఉన్న మచిలీపట్నంలో, ఒక్క లిఫ్టు ఏర్పాటు చేయకపోవడం వలన రైల్వే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని బాలాజీ చెప్పారు. ఉదయం ఏడు గంటలకు విజయవాడ వెళ్లే ట్రైన్ మూడో నెంబర్ ప్లాట్ ప్లాట్ఫారం పెట్టడం వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు , తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా విశాఖపట్నం ట్రైన్ కూడా రెండు లేదా మూడు ప్లాట్ఫారాల్లో పెట్టడం వల్ల లిఫ్ట్ లేకపోవడంతో, రైల్వే కూలీలు లేకపోవడంతో ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులు మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది మరింత పెరిగాయని , తక్షణమే ఇట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతిరోజు బీదర్ నుండి మచిలీపట్నం వచ్చే ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రతిరోజు అరగంట నుండి గంట వరకు ఆలస్యం కావడం వల్ల సికింద్రాబాద్ స్టేషన్ లో మచిలీపట్నం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూర్చోవడానికి సిమెంట్ బల్లలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విజయవాడ నుండి రాత్రిపూట మచిలీపట్నం వచ్చే రైలులో రైల్వే పోలీస్ బందోబస్తు పెరగాలని , ప్రయాణికులకు సెక్యూరిటీ ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చే రైతులకు రెండున్నర గంటల సమయం పడుతుంది ప్రయాణ సమయంలో తగ్గించినట్లయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని , గుడివాడలో ఎక్కువ సమయం రైలు నిలవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అదేవిధంగా రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు అధికంగా ఉందని రైల్వే టికెట్ కంటే పార్కింగ్ ఫీజు ఎక్కువగా కావడం వల్ల రైల్వే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని , మచిలీపట్నం నుండి ప్రతి రెండు గంటలకు గుడ్లవల్లేరు గుడివాడ స్టాపులతో విజయవాడకు అదనపు రైల్వే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా మచిలీపట్నం తిరుపతి రైలు రెగ్యులర్ గా మచిలీపట్నం నుండి ఏర్పాటు చేయాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు జిల్లా ముఖ్య కేంద్రం నుండి ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ తక్షణమే చర్చలు జరపాలని కోరారు. లిఫ్ట్ ఏర్పాటు కోసం గతంలో ఎంపీ పండ్ నుండి 50 లక్షలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alleviate the sufferings of