TRINETHRAM NEWS

పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి విజన్‌తో తాము చేసిన పనులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీల అమలు చేయలేకపోతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.

బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రచారం చేశారని ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టు మారిందని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇస్తామని ఊదరగొట్టారని బాండ్లు కూడా ఇచ్చారని అన్నారు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.

అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందన్నారు జగన్. అమరావతి పేరుతో 52 వేల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ఇప్పుడు తీసుకొచ్చినవే కాకుండా తీసుకురాబోతున్న అప్పులు కలుపుకుంటే లక్షా 45వేల కోట్ల పైమాటే అన్నారు.

ఇంత అప్పులు తీసుకొచ్చి పేదలకు ఏమైనా బటన్ నొక్కారా అని ప్రశ్నించారు. గతంలో తాము అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా అని నిలదీశారు. సూపర్ 6 లేదు సూపర్ 7 లేవని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Jagan