All NTPC contract workers prepare for strike fight
సమ్మెతోటే హక్కుల సాధన పోరాడి సాధించుకున్న హక్కుల రక్షణ సాధ్యం
IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి పిలుపు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
NTPC IFTU కార్యాలయంలో IFTU ఎన్టిపిసి బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది. *ఈ సమావేశానికి IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎన్ టి పి సి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతో అనేక అవార్డులు పొందుతున్నది. చేసిన ఒప్పందాలను సైతం యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయకుండా వేధింపులకు గురిచేస్తుంది. పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కాలరాస్తున్నది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై గతంలోనే ఒప్పందం కుదిరినా యాజమాన్యం నేటికీ అమలు చేయడం లేదు.
తెలంగాణ ప్రాజెక్టులో కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ఏడాది పరిమితితో కూడిన గేట్పాస్లు జారీ చేయాలి.
కార్మికుల వైద్య పరీక్షల అంశం ఎత్తివేయాలి.
కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసు వెరిఫికేషన్ విధానం తొలగించాలి.
సెక్యూరిటీ కోసమని ప్రారంభించిన పంచింగ్ పద్ధతిని వేతనాల కోసం వినియోగించరాదు.
60ఏళ్ల వయసు దాటిన కార్మికుల గేట్పాస్ల నిలిపివేత సరికాదు.ధన్వంతరి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలి .
గత వేతన ఒప్పందం 15 ఆగస్టు 2022న ముగిసింది. దీంతో కొత్త వేతన సవరణ కోసం అదే ఏడాది ఆగస్టు 22న ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద కాం ట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఎన్టీపీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు, కార్మిక శాఖ అధికారుల సమక్షంలో కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణపై జరిగిన ఒప్పందం అమలు కాకపో వడం బాధాకరం. కార్మికులకు హక్కులు కల్పిం చకపోవడం, శాంతియుత ఉద్యమాలపై లాఠీచార్జి చేయడం శోచనీయం.
కాంట్రాక్ట్ కార్మికులంతా తమ హక్కుల సాధనకై సమ్మెకు సిద్ధంగా ఉండాలని సమ్మె తోటే హక్కుల పరిరక్షణ సాధ్యమని కాంట్రాక్టు కార్మికులందరికీ భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU ప్రగతిశీల కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ పిలుపునిస్తున్నది. కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకొని కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం అవసరమైతే సమినోటీసి ఇచ్చి సమ్మెకు అయినా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మికులంతా కూడా సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో IFTU రాష్ట్ర నాయకులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి,ఎన్టిపిసి బ్రాంచ్ అధ్యక్షులు మార్త రాములు ప్రధాన కార్యదర్శి తూల్ల శంకర్, గుమ్మడి వెంకన్న గూడూరి వైకుంఠం,నాయకులు గొల్లపల్లి చంద్రయ్య మాటేటి పోషం, ఇనుగాల రాజేశ్వర్, కలవల రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App