TRINETHRAM NEWS

గణతంత్ర దినోత్సవ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) బాపట్ల శాఖ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు యచంద్ర మరియు RSS నగర కార్యవాహ ఉపేంద్ర గారు గారు జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో 1000 మంది విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సూళ్ళూరు యచంద్ర మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా దేశంలో అనేక విద్యార్థుల గుండెల్లో జాతీయ భావాలను నింపుతూ క్షణం క్షణం మాకణం కణం భరతమాతకే సమర్పణం అంటూ ఏబీవీపీ సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తుందని. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకే కాకుండా విద్యార్థుల్లో చైతన్యం కోసం కూడా ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందని, భారతదేశ స్వతంత్రం కోసం అనేకమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలర్పించారని వారు కన్నా కలలన్నిటిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వాటిని నెరవేర్చకు కృషి చేయాలని, ఏబీవీపీ సాధిస్తున్న ప్రతి విజయం ఈ దేశం కోసం నిరంతరం సరిహద్దుల్లో గస్తీగాస్తు ప్రాణాలు సైతం అర్పిస్తున్నటువంటి ప్రతి సైనికుడికి అంకితం చేస్తుందని, ఇటువంటి అనేక కార్యక్రమానికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పాల్గొనేందుకు సిద్ధపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళి గారు, వెంకట రామకృష్ణ గారు, కార్తికేయ, ఈశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు.