
Trinethram News : హీరో అజిత్‌కు మరోసారి ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. వీడియో వైరల్..అభిమానుల్లో ఆందోళన
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యన కార్ రేసింగుల్లోనూ పాల్గొంటున్నాడు.
ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగుల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు.
అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది.
మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయట పడినట్లు వీడియోలో కనిపించింది.
హీరోకు ఎలాంటి గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
