AITUC condemns Maddi Ellaiah gang attack on Singareni Dalit woman worker arrested
చేయకపోవడాన్ని నిరసిస్తూ చౌరస్తా గోదావరిఖనిలో దళిత మహిళా సంఘాల ధర్నా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అటెంప్ట్ మర్డర్ పిడి యాక్టివ్ పెట్టి వెంటనే అరెస్టు చేయకపోతే డీజీని మానవ హక్కుల కమిషన్ ను కలుస్తాం హెచ్చరించి గర్జించిన మహిళ దళిత సంఘాలు
14 అర్ధరాత్రి పథకం రచించి ప్లాన్ ప్రకారం పిలిచి సింగరేణి దళిత మహిళ వితంతు కార్మికురాలైన జనగామ స్వప్న పై పైసాచికంగా గుర్తింపు సంఘం ఎర్రజెండా ఎఐటియుసి ముసుగులో మడ్డి ఎల్లయ్య మరియు గ్యాంగ్ దాడి చేసి బూతు పదజాలాలు వాడుతూ ఇష్టం వచ్చిన శరీర భాగాల మీద ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి గాయపరచడం స్వప్న పై దాడి గ్యాంగ్ అత్యాచార ప్రయత్నం చేయడం జరిగింది.ఈ సంఘటనకు పాల్పడిన మడ్డి ఎల్లయ్య మరియు దుండగులను ఇంతవరకు అరెస్టు చేసి కస్టర్డ్లకు తీసుకొని రిమాండ్ కు పంపించకపోవడానికి స్థానిక పోలీస్ నిర్లక్ష్యానికి నిరసిస్తూ దళిత మహిళా సంఘాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడి చౌరస్తాలో మహిళా దళిత సంఘాలు ధర్నాకు దిగాయి.
ఈ సందర్భంగా స్వప్న మరియు మహిళా దళిత సంఘం నాయకురాలు మద్దెల భవాని కల్లేపల్లి శిరీష
మహిళనాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా ఈ దేశంలో మహిళ తిరిగే పరిస్థితి లేధా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు లేదా ఒంటరిగా భర్త లేకుండా ఒక వితంతు మహిళ సింగరేణి కార్మికురాలి అని చూడకుండా దళితురాలు అయితే. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ తిడతారా..!
అత్యాచారానికి హత్యకు ఒడిగడతారా వీరిపై పోలీస్ శాఖ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకుంది అని ప్రశ్నించారు. బజార్లలో వారి యూనియన్ పార్టీ కార్యాలయంలో యదేచ్చగా సోషల్ మీడియాలో వార్నింగ్లు బెదిరింపులకు పాల్పడుతూ మిమ్ములను చంపేస్తాం మీ అంత చూస్తామని అంటూ ఒకపక్క బెదిరిస్తూ తిరుగుతా ఉంటే స్థానిక పోలీస్ వారి మధ్య ఏం జరిగిందో అర్థం కావడం లేదన్నారు.
బాధితురాలినైన నన్ను న్యాయం జరుగుతలేదని అన్యాయం అంటూ నినదీస్తే ప్రశ్నిస్తే నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడడం ఏమిటి అని ప్రశ్నించారు. వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించకపోతే మానవ హక్కుల కమిషన్ డీజీ హైకోర్టు న్యాయమూర్తి కలవాల్సి వస్తుందని దళిత సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేసి తీరుతాయని దళిత మహిళా సంఘాలు ఈ సందర్భంగా హెచ్చరించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App