
మెండె శ్రీనివాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సెన్ ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డి డి రామానందన్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 500 మంది డెలిగేషన్ గా పాల్గొన్నారు, సింగరేణి నుండి 30 మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు డెలిగేషన్ గా పాల్గొన్నారు, రామగుండం బ్రాంచి వన్ ఏరియా నుంచి ఆరుగురం డెలిగేషన్ గా పాల్గొనడం జరిగిందని రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండె శ్రీనివాస్ తెలియజేశారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఈరోజు నుండి 28 నుండి 30 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలలో కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పోరాట రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు, సింగరేణి కార్మికుల సమస్యలు సొంత పథకం అమలు అలవెనుసులపై ఐటి మాఫీ పెన్షన్ పిఎఫ్ డెసిగ్నేషన్లో మార్పు ఇంక్రిమెంట్లో చెల్లింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామన్నారు,
అలాగే కోల్ ఇండియా సింగరేణి ప్రైవేటీకరణ రద్దు చేయాలని తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలని తదితర అంశాలపై మే 20 జరుగు జాతీయ సమ్మెను కోల్ ఇండియా సింగరేణిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, ఆర్జీవన్ నుండి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహ రావు, రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, అన్నబోయిన శంకరన్న, వంగల శివరాం రెడ్డి, అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
