TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు..

సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు అంశాలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అవి ఆయన మాటట్లోనే.. ”పార్టీ అభ్యర్థలును కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసమే టీడీపీ-జనసేన పొత్తు”..

”ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకం. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకం.. కాబట్టటి నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజలకు భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలి. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం.. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది అవుతుంది. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్‌ను.. ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది”..

”జగన్ ఎన్నికలకు సిద్దంగా లేడు.. సిద్ధం సభలు పెడుతున్న జగన్.. అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారు. ఎంత సీనియర్ నేత అయినా.. ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా.. చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలి. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న శ్రేణులను కలుపుకొనిపోవాలి. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలి. జనసేన నేతలను కలుపుకొనిపోవాలి. ఇరు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే.. 100 శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది. వైసీపీ పాలనపై ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉన్నారు. మంచి వారు పార్టీలోకి వస్తే ఆహ్వానించండి. జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం దౌర్జన్యాలు, అక్రమాలు.. దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు. మనం ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. అన్నింటికీ టీడీపీ కార్యకర్తలు సిద్దంగా ఉంటూ గెలుపే లక్ష్యంగా పని చేయాలి”.. అంటూ చంద్రబాబు నాయుడు సూచించారు..